
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్లు శ్రీను, గణేష్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్లు వై.వి.గణేష్, మేన శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 113 వినతులు వచ్చినట్లు తెలిపారు.
వినతులను నిర్లక్ష్యం చేయొద్దు
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేయొద్దని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై 101 అర్జీలు రాగా.. ఆమె స్వీకరించారు. వినతుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఏడీఏ అనురాధ, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

అర్జీలు త్వరగా పరిష్కరించాలి