
దేశ ప్రగతిలో సీఏల పాత్ర కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ప్రగతిలో సీఏల పాత్ర ఎంతో కీలకమని క్రేన్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) గుంటూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న గ్రంథి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ సీఏ విద్యకు గుంటూరు నగరం కేంద్రంగా ఉందని, వివిధ రాష్ట్రాల విద్యార్థుల ఇక్కడికి వస్తున్నారని అన్నారు. విద్యార్థులు సీఏ విద్యను ఎంపిక చేసుకోవడం ద్వారా ఉన్నత భవిష్యత్ అందిపుచ్చుకోగలరని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రామ్ కుందుల, సీఏ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ గుంటూరు చాప్టర్ చైర్మన్ చింతా వీఎన్‌ఎస్ రఘునందన్, వైస్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ, కార్యదర్శి వనిమిరెడ్డి వెంకట నరేష్, కోశాధికారి కన్నెగంటి మృత్యుంజయరావు, సికాస చైర్మన్ నాగబీరు రాజశేఖర్, సభ్యులు షేక్ బాజీ, దేసు సంపత్ పాల్గొన్నారు.
క్రేన్ సంస్థల అధినేత గ్రంథి లక్ష్మీకాంతారావు