
ప్రజా సమస్యలపై పోరుబాట
తాడేపల్లిరూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లి రూరల్‌లోని కుంచనపల్లి ప్రాతూరురోడ్‌లో ఉన్న ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశ ఏర్పాట్లను ఆయన గుంటూరు ఈస్ట్, మంగళగిరి, సత్తెనపల్లి నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మల రామానాయుడుతో కలసి పరిశీలించారు. అనంతరం అంబటి మాట్లాడుతూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మండల, పట్టణ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులతో బాబు ష్యూరిటీ – మోసాలు గ్యారెంటీ అనే అంశంపై సమావేశం నిర్వహిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో బాబు మోసాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశం.. క్యూఆర్ కోడ్ వినియోగంపై ఈ సమావేశం ఉంటుందని తెలిపారురు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, కుంచనపల్లి అధ్యక్షుడు మిరియాల రాంబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నేడు వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల విస్తృత స్థాయి సమావేశం ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం వివరాలు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు