Winter Food: నువ్వుండలు, ఎండిన ఫలాలు.. పిల్లలకు ఇవి తినిపిస్తే

Winter Season: Avoid These Foods To Kids What To Eat What Not Telugu - Sakshi

Winter Season: Avoid Giving These Foods To Kids What To Eat What Not Telugu: పిల్లలకు ఈ సీజన్‌లో ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టిపెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి.

ముఖ్యంగా పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం వారికి తినిపించాలి.
నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి.


ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను అలవాటు చేయడం మంచిది. 
ఉదాహరణకు కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్‌ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి.
ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి.


పిల్లలకు క్యాల్షియమ్‌ సమృద్ధిగా లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. లేదంటే నువ్వుండలు తిన్నా మంచిదే.
అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి.

చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు...

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top