Health Tips: కాలీఫ్లవర్‌, క్యారెట్లు, బీట్‌రూట్‌, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త..

Health Tips: Do Not Eat Cauliflower Carrot Beetroot Too Much May Side Effects - Sakshi

ఆచి చూచి తినండి

Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.  ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు.

అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌
కాలీఫ్లవర్‌ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి.

పుట్టగొడుగులు
పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ  దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు.  వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 

క్యారట్లు
క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

బీట్‌రూట్‌
బీట్‌రూట్స్‌ను సలాడ్‌లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. 

చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్‌! డైట్‌తో కంట్రోల్‌ చెయ్యొచ్చా?
Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్‌ తీసుకున్నారంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top