దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..! | Family Finds Rs 2 Lakh Hidden in Old DTH Box During Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!

Oct 14 2025 2:04 PM | Updated on Oct 14 2025 3:14 PM

Family Finds Rs 2 Lakh Hidden in Old DTH Box During Diwali

పండుగ సమీపిస్తున్న వేళ ఎప్పుడో దాచిన డబ్బు అనుకోకుండా బయటపడితే..ఆ సంతోషమే వేరేలెవల్‌. అందులోనూ దీపావళి అంటే మహాలక్ష్మీదేవి పండుగ..అమ్మ ముందుగానే ఇలా కనక వర్షం కురిపిస్తే..ఆ సంతోషం మాటలకందనిది. అలాంటి ఆనందంలోనే తడిసిముద్దవుతోంది ఈ కుటుంబం.

దీపావళి పండుగ సమయం అని ఇల్లంతా క్లీన్‌ చేస్తుండగా..ఎప్పుడో దాచిన డబ్బులు బయటపడ్డాయి.  ఆ సంగతే మర్చిపోయింది ఆ ఫ్యామిలీ. అనుకోకుండా పండుగ నేపథ్యంలో ఇల్లు శుభ్రం చేస్తుండగా పాత డీటీహెచ్‌ బాక్స్‌లో దాచిన సొత్తు బయటపడింది. దగ్గర దగ్గర రెండు లక్షలు ఉండటంతో ఆ కుంటుంబం సంతోషానికి అవధులే లేకుండా పోయింది. "మహాలక్ష్మీ ముందుగానే మమ్మల్ని కటాక్షించింది. ఇది దీపావళి పండుగ ఆశీర్వాదమే అంటూ పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబవ్వుతోంది ఆ కుటుంబం". అయితే అందులో ఉన్నవన్నీ రూ. 2 వేలు నోట్లు కావడం గమనార్హం. 

బహుశా ఈ డబ్బుని మా నాన్నగారు నోట్లు రద్దు చేయకమునుపు దాచి ఉంచి ఉండొచ్చుని..ఆయనకి ఈ సంగతి ఇంకా తెలియదంటూ రెడ్డిట్‌లో ఈ సంగతిని షేర్‌ చేయడంతో నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు తక్షణమే ఆ నోట్లను మార్చుకోండి. ఆర్బీఐని సంప్రదించే మందు ఆ డబ్బు ఎక్కడిది ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చిందో తెలియజేయాలన్న విషయం మర్చిపోకండి బీకేర్‌ఫుల్‌ అని సూచిస్తూ పోస్టులు పెట్టారు. 

కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మే 19, 2023న చలామణి నుంచి రూ.2000 డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, రూ.5,884 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాట్లు సమాచారం.

(చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement