అంతర్‌జిల్లా నేరస్తుడి అరెస్టు
చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్తుడిని నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 8లో u
మామిళ్ళపల్లి జయప్రకాష్
ఏలూరు (టూటౌన్): వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్సీపీ ఏలూరు ఇన్‌చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. ఫూలే జయంతిని పార్టీ నగర కార్యాలయంలో శనివారం బీసీ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జయప్రకాష్ పాల్గొని ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాలకు కోసం ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, నగర వైఎస్సార్‌సీపీ నేతలు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, దాసరి రమేష్, మున్నుల జాన్ గుర్నాథ్, కొల్లిపాక సురేష్, ఇనపనూరి జగదీష్, కేదారేశ్వరి, విజయనిర్మల, కార్యకర్తలు పాల్గొన్నారు.


