ఏలూరు (టూటౌన్): రద్దు చేసిన హక్కులను పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కోట దిబ్బ ప్రాంతంలో నిరసన తెలిపారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని క్యాంప్ కార్యాలయంలో కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కె.మహాలక్ష్ముడు, ఎ.అప్పలరాజు మాట్లాడుతూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 2025 సివిల్ పెన్షన్ వాలిడేషన్ చట్టంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర్ రావు, ఎన్.మధుసూదనరావు, కరీం తదితరులు పాల్గొన్నారు.


