చెరువు గుట్కాయస్వాహా! | - | Sakshi
Sakshi News home page

చెరువు గుట్కాయస్వాహా!

May 31 2025 5:10 AM | Updated on May 31 2025 5:10 AM

చెరువ

చెరువు గుట్కాయస్వాహా!

బియ్యపుగుంట చెరువును పూడ్చేసిన

ఆక్రమణదారులు

అధికార పార్టీ నాయకుల అండదండలతోనే

పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు

నిడదవోలు: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తుందా.. పాగా వేసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. దీనికి తాజా ఉదాహరణగా నిడదవోలులోని బాలాజీనగర్‌లో మున్సిపాలిటికి చెందిన బియ్యపుగుంట చెరువును ఆక్రమణదారులు పూడ్చివేశారు. బుధవారం రాత్రికి రాత్రే లారీలతో మంటి తరలించి 80 సెంట్ల ఉన్న చెరువును పూడ్చివేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మున్సిపల్‌ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలిచి సరిహద్దు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు.

విలువైన భూమి

పట్టణ శివారున బాలాజీనగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంజోరుగా సాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రైతుల నుంచి పొలాలు కొని వెంచర్లు వేసి అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన 80 సెంట్ల బియ్యపుగుంట చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం భూమి రూ.10 వేలు పలుకుతోంది. సెంటు భూమి సుమారు 4.80 లక్షలు అయితే 80 సెంట్ల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఎక్కువగా చాగల్లు మండలం ధారవరం, బ్రాహ్మణగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 300కి పైగా పశువులు చెరువులో దాహం తీర్చుకునేవి. సుమారు 50 ఎకరాలకు సంబంధించిన మురుగునీరు చెరువుకు చేరడంతో పొలాలకు నష్టం లేకుండా ఉండేది. అయితే చెరువును పూడ్చివేయడంతో వర్షపునీరు, పంట మురుగునీరు వెళ్లే దారిలేక భవిష్యత్‌తో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు కరువవుతుందని వాపోతున్నారు.

చెరువు గుట్కాయస్వాహా!1
1/1

చెరువు గుట్కాయస్వాహా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement