మా నోట మన్నేశారు!
గత్యంతరం లేక ఉద్యమం
చేనేత, ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ రకాల బకాయిలు పేరుకుపోతుండటంతో చేనేత సంఘాలు నిర్వీర్యమవుతున్నాయి. కనీసం చేనేత కార్మికుడికి పని కల్పించలేని పరిస్థితులు వచ్చాయి. ఆప్కో బకాయిలు పాక్షికంగా కాకుండా పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల అధికారులకు వినతి పత్రాలు అందించాం. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమానికి దిగాల్సి వస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.
– గుడిమెట్ల శివరామకృష్ణ, ఉమ్మడి జిల్లా చేనేత సహకార సంఘాల జేఏసీ సభ్యుడు, అంగర
కపిలేశ్వరపురం: బ్రిటిష్ మహారాణికి అగ్గిపెట్టెలో చీరను నేసిచ్చిన ఘనత మన చేనేత రంగానిది. అలాంటి చేనేతలను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నివిధాలా అందుకుంది.. నేతన్న నేస్తం పథకం ద్వారా జిల్లాలో మొత్తం 3,560 మందికి లబ్ధి చేకూర్చింది. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఎన్నికల సమయంలో ఈ పథకానికి రూ.వెయ్యి అదనంగా వేసి ఇస్తామని ‘కూటమి’ ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా అమలుకు మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలో సుమారు 3,600 చేనేత మగ్గాలు ఉండగా, ఆప్కో బకాయిలు గుదిబండగా మారాయి. ఈ బకాయిలు చెల్లించాలంటూ నేతన్నలు అనేక సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేక ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో 23 చేనేత సంఘాలు ఉన్నాయి. ఆప్కో, ప్రభుత్వం నుంచి రూ.కోట్ల బకాయిలు పెరిగిపోవడంతో ఈ సంఘాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది. 2018 జీఓ ప్రకారం చేనేత కార్మికులకు కొనుగోలు చేసే నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాలి. వస్త్రాల అమ్మకాలపై 30 శాతం డిస్కౌంట్ సహకార సంఘాలకు అందించాలి. ఆప్కో బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులకు రోజువారీ పనులను చూపలేని పరిస్థితి నెలకొంది. సంఘాల పరిధిలో తయారు చేసిన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసినా దీర్ఘకాలికంగా బకాయిలు పేరుకుపోయాయి.
సహకార సంఘాలు.. బకాయిలు
రెండు నెలల కిందట వరకూ జిల్లాలోని పలు సంఘాల బకాయిలు ఇలా ఉన్నాయి. అంగర చేనేత సహకార సంఘానికి రూ.3.85 కోట్లు, నేలటూరు సహకార సంఘానికి రూ.1.34 కోట్లు, నల్లూరు సంఘానికి రూ.1.18 కోట్లు, మండపేట సంఘానికి రూ.1.87 కోట్లు, ఏడిద సంఘానికి రూ.47.74 లక్షలు, రాయవరం సంఘానికి రూ.65 లక్షలు, పసలపూడి సహకార సంఘానికి రూ.1.62 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటి కోసం ఆయా సంఘాల్లో సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఇక ఉద్యమమే ఆయుధంగా..
చేనేత బకాయిలు రాకపోతే సంఘాల నిర్వహణ కష్టసాధ్యమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో చేనేత సహకార సంఘాల ప్రజాప్రతినిధులు ఐక్యంగా కార్యాచరణకు దిగారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ప్రైవేట్ సహకార సంఘాల జేఏసీ నాయకులు అమలాపురంలో జేసీ నిషాంతికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ సంఘాల పరిస్థితిని ఆప్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రస్తుతమున్న సంఘాల పరిస్థితి నేపథ్యంలో ఆప్కో పూర్తి బకాయిలను సంఘాలకు చెల్లించాలని పాక్షిక చెల్లింపులతో ఒరిగేది ఏమీ ఉండదని నాయకులు అంటున్నారు. అరకొర చెల్లింపులతో సర్థిపెట్టితే ఇప్పటికే సంఘాలు చేసిన అప్పుల వడ్డీకి కూడా సరిపోవని చెబుతున్నారు. ఆప్కో, ప్రభుత్వం చేనేత సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించని పక్షంలో జిల్లాలోని 18 చేనేత కుల సంఘాలు, చేనేత ఉద్యమ సంఘాలు సంయుక్తంగా ఉద్యమ కార్యాచరణకు దిగుతామని నాయకులు ప్రకటించారు. ఈ నెల 15న రాజమహేంద్రవరంలోని ఉమా రామలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 40 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ హాజరై బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపు విడుదల చేయకపోతే రిలే దీక్షలతో ప్రారంభించి ఆమరణ దీక్షలకు కార్యాచరణ చేస్తామని ప్రకటించారు.
·˘ ^ól¯ól™èl çÜ…çœ*-ÌSMýS$
గుదిబండలా బకాయిలు
·˘ B´ùP, {糿¶æ$™èlÓ… ¯]l$…_ ^èl$MðSP-§ýl$Æý‡$
·˘ AÐ]l$Ë$ M>° Ð]l$…{† çÜ$¿ê‹Ù àÒ$
·˘ çܵ…¨…-^èl-MýS-´ù™ól
సంక్రాంతి తర్వాత ఉద్యమం
మంత్రి మాటిచ్చినా..
ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరి వారంలో మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్మికులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు. ఆందోళన చేపట్టిన కాలం నాటికి రూ.3.85 కోట్ల వివిధ రకాల బకాయిలున్నాయి. వాటిని చెల్లించాలంటూ సెప్టెంబర్ 27న అంగర గ్రామంలో నిరసన ర్యాలీ చేశారు. తర్వాత సహకార సంఘం ఎదుట 14 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. చేనేత కార్మికుల ఆందోళన నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో స్వయంగా జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న సహకార సంఘం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ మూడో వారం నడుస్తున్నా బకాయిలు సహకార సంఘాలకు నిధులు జమ కాకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు.
మా నోట మన్నేశారు!
మా నోట మన్నేశారు!


