నిండు జీవితానికి రెండు చుక్కలు
రాయవరం: పిల్లల ఆరోగ్యం విషయంలో ముందుచూపు అవసరం. రెండు చుక్కలు చిన్నారుల జీవితాన్ని పోలియో బారిన పడకుండా చేస్తాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పిల్లలు పుట్టగానే వారికి పోలియో వ్యాధి నివారణ వ్యాక్సిన్ ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జిల్లాలో 1,48,942 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నెల 21న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 27 ట్రాన్సిట్ పాయింట్లు, 53 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 549 హైరిస్క్ ఏరియాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 3,624 మంది ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఉన్న 47 పీహెచ్‌సీలు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 978 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలియో చుక్కల కార్యక్రమంలో 3,912 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 503 మంది ఏఎన్‌ఎంలు, 428 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 1,384 మంది ఆయాలు, 1,597 మంది అంగన్‌వాడీ సిబ్బంది, 193 మంది సూపర్‌వైజర్లు పల్స్ పోలియో విధుల్లో పాల్గొననున్నారు.
ఫ 21న చిన్నారులకు పల్స్‌పోలియో
ఫ జిల్లాలో 1.48 లక్షల మందికి లక్ష్యం


