ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అంటే డబ్బుతో పని. అదే ప్రభుత్వం ద్వారా వైద్య కళాశాలలు నడిపితే పేదలకు వై ద్యం ఉచితంగా అందుతుంది. అలాగే ప్రైవేట్ విధానంలో వైద్య విద్యను పేదలు చదవలేరు. ప్రభుత్వ వైద్య విధానంలో పేదలు డాక్టర్లు అవుతారు. అందుకే వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని నమ్ముతున్నాను.
– పువ్వల సుశాంత్, విద్యార్థి, పదో
తరగతి, ఏడిద, మండపేట మండలం
సామాజిక బాధ్యతగా
సంతకం చేశా
గత ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రారంభించినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయాలి. కాదని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఆ కళాశాలలు ఖరీదైనవిగా మారి పేదలకు దూరవుతాయి. అందుకే సామాజిక బాధ్యతగా సంతకం చేశాను.
– ఖండవల్లి మంజులహరి, విద్యార్థి, డిగ్రీ సెకండ్ ఇయర్, ఏడిద, మండపేట మండల
పీపీపీని రద్దు చేయాలి
పీపీపీ విధానంలో వైద్య విద్య అందించాలనే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయాలి. ఇదేమీ తప్పు కాదు. పైగా పేదలకు మేలు జరుగుతుంది. లేకపోతే సామాన్యులకు వైద్య విద్య అందకుండా పోతుంది.
– కరీం వికాస్, కొత్తపేట
ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రభుత్వమే నిర్వహించాలి


