జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
ఐ.పోలవరం: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్‌ను డీఈవో పి.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఐ.పోలవరం మండలం జి.వేమవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఈవో జిల్లా విద్యా వైజ్ఞానిక పోస్టర్‌ను జిల్లా సైన్స్ అధికారి జి.సుబ్రహ్మణ్యం, డీసీబీ సెక్రటరీ బి.హనుమంతరావు, మండల విద్యా శాఖ అధికారులు నల్లమిల్లి కొండారెడ్డి, వీధి సురేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా లో సోమవారం అమలాపురం బాలుర ఉన్నత పాఠశాలలో జరగనుంది. మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 11 ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు సుమారు 100 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఆయా విభాగాలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా వేగిరాజు వెంకట నారాయణ.పి.వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి వ్యవహరించగా, జి.వేమవరం సర్పంచ్ నల్లా సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు చోడిశెట్టి జ్యోతినాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, హెచ్‌ఎం సుభద్ర లక్ష్మీదేవి, మండల సైన్స్ ఆఫీసర్ వరద శ్రీనివాసరావు పాల్గొన్నారు.


