దిక్సూచిలా కోనసీమ వలసదారుల కేంద్రం
అమలాపురం టౌన్: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోనసీమ వలసదారుల కేంద్రం ఓ దిక్సూచిలా నిలిచి విదేశాల్లో చట్ట బద్ధమైన సురక్షిత ఉపాధిని కల్పించేందుకు పూర్తిగా దోహదపడుతోందని ఆర్టీవో, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) నోడల్ అధికారి కొత్త మాధవి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఆర్డీవో గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ స్థానికంగా సరైన ఉపాధి అవకాశాలు లభించక మెరుగైన ఉపాధి కోసం వివిధ కారణాలతో తమ స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి హక్కులను రక్షించడం కేసీఎం లక్ష్యమని పేర్కొన్నారు. కేసీఎం మేనేజర్ గోళ్ల రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.


