పలువురికి కారుణ్య నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తూ మరణించిన వారి వారసులు 31 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ 23 మందిని జూనియర్ సహాయకులుగా, 8 మందిని టైపిస్ట్‌లుగా నియమించినట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నియామకాలను పారదర్శకంగా చేపట్టామన్నారు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ తమ కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు, ఈ ఉద్యోగ అవకాశం కల్పించడం ద్వారా కొండంత అండ ఇచ్చినట్లు అయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే త్వరితగతిన ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసినందుకు జెడ్పీ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


