మాదిగలకు మరిన్ని సీట్లు కేటాయించాలి
● ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్
● ఉత్సాహంగా మాదిగల ఆత్మీయ కలయిక
అమలాపురం రూరల్: 70 ఏళ్ల చరిత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు మాలలకే ఇచ్చి మాదిగలకు ద్రోహం చేశాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తురన్నారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్‌లో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం పెరుగుతున్నాయని, వాటిని రాజకీయ పార్టీలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేరూరులోని కొంకాపల్లి సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన మాదిగల ఆత్మీయ కలయికలో ఆయన పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. తొలుత యువత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ 70 ఏళ్ల చరిత్రలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే జిల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చి తమ ప్రాధాన్యాన్ని పెంచుకున్నారన్నారు. ఇతర పార్టీలు మాదిగల పట్ల తమ వైఖరి చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోవాలన్నారు. 2009–19 ఎన్నికల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే సీటు మాదిగలకు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వచ్చే పంచాయతీ, మున్సిపల్ మండల పరిషత్ జెడ్పీటీసీ ఎన్నికల్లో 6 శాతం వాటా మేరకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డి మాండ్ చేశారు. దండోరా ఉద్యమంలో పోరాటం చేసి న మాదిగ నాయకులను ఇజ్రాయిల్ సత్కరించారు. ఆత్మీయ కలయికను విజయవంతం చేసిన ఎమ్మెల్సీని సంఘం నాయకులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు మడికి శ్రీరా ములు, యార్లగడ్డ రవీంద్ర, చెయ్యెటి శ్రీనుబాబు, బడుగు శ్రీను, నేదునూరి నథానిల్, పలివెల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


