
కదలిరండి.. కోటి సంతకాల ఉద్యమానికి..
● వైద్య కళాశాలల
ప్రైవేటీకరణను అడ్డుకుందాం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు,
నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు
అమలాపురం రూరల్: రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రారంభించిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నుంచి జిల్లాలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అమలాపురం మండలం భట్నవిల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ గృహంలో ఉద్యమ కార్యాచరణపై జిల్లాలోని ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులతో జగ్గిరెడ్డి సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 45 రోజుల పాటు ప్రజా ఉద్యమం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేసి సమస్యను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. 22వ తేదీ వరకూ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి శనివారం నియోజకవర్గాల్లో పోస్టర్ల ఆవిష్కరణతో పాటు నిరసన కార్యమాలు చేస్తామని, ఈ నెల 28న ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న కోనసీమ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందిస్తామని జగ్గిరెడ్డి వివరించారు. ఈ నెల 23న మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో సంతకాల సేకరణ చేసి, జిల్లాకు ర్యాలీగా సంతకాల ప్రతులను తీసుకు వస్తామన్నారు. ఇప్పటికే ఐదు వైద్య కళాశాలలను సీఎం చంద్రబాబు తన అనుచరులకు పీపీపీ విధానంలో ఇచ్చేస్తున్నారని అన్నారు. కళాశాలల భూములను తాకట్టు పెట్టి వారు డబ్బు తెచ్చుకుంటారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 17 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల నిర్మాణాలకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనులు ప్రారంభించారని, వీటిని పూర్తి చేయడానికి చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ అన్ని సదుపాయాలు సమకూర్చినా చంద్రబాబు అడుగు ముందుకు వేయడం లేదన్నారు. వందేళ్లలో రాష్ట్రంలో కేవలం 12 వైద్య కళాశాలలే ఉన్నాయని, గత వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్తగా 17 కళాశాలలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్లను జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు, కోఆర్డినేటర్లు, నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, సీఈసీ సభ్యులు చింతా అనురాధ, పాముల రాజేశ్వరీదేవి, పితాని బాలకృష్ణ, పీకే రావు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, చింతపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కుడుపూడి వెంకటేశ్వరబాబు, కుడుపూడి భరత్ భూషణ్, సాకా మణికుమారి, నేలపూడి స్టాలిన్‌బాబు, కాశి మునికుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి తాతాజీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు గొల్లపల్లి డేవిడ్‌రాజు, మట్టపర్తి నాగేంద్ర, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, గుత్తుల చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

కదలిరండి.. కోటి సంతకాల ఉద్యమానికి..