అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్‌తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
అర్జీలకు నూరు శాతం పరిష్కారం
అమలాపురం రూరల్: అర్జీలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో కలెక్టర్, డీఆర్‌ఓ రాజకుమారి, డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, ఎస్‌డీసీ కృష్ణమూర్తి, డీఎల్‌డీవో రాజేశ్వరరావు 255 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ప్రజాసమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 15 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 25 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ అర్జీల స్వీకరించారు. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన పితాని వెంకటేశ్వరరావు తన దగ్గర బంధువుల నుంచి ఆస్తులపరంగా మోసానికి గురయ్యాయని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కుటుంబ తగాదాపై ఏఎస్పీ బాధితులతో చర్చించారు. అమలాపురంలో విలువైన స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న తన బంధువుల నుంచి తన స్థలాన్ని ఇప్పించాలని వెంకటేశ్వరరావు తన ఫిర్యాదులో కోరారు. భూ తగాదాలతోపాటు కుటుంబ వివాదాలకు చెందిన ఫిర్యాదులపై కూడా అర్జీదారులతో మాట్లాడారు. ఎస్సై గంగాభవాని కూడా పాల్గొన్నారు.
అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం
అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం


