
జమైకా హ్యాపిల్!
యానాం: కరీబియన్ దీవులలో వెస్ట్ండీస్ సమీపంలోని జమైకా ద్వీప దేశంలో జమైకా ఆపిల్గా పిలిచే చెట్టు యానాం పట్టణంలో ఓ గృహంలోని పెరట్లో వందలాది కాయలతో విరగకాస్తుండటంతో పలువురిని ఆకర్షిస్తోంది. దీంతో పలువురు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఆ చెట్టును చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బాలయోగి కాలనీలో కేతా ఫణి, జగదాంబకు చెందిన గృహంలో 15 ఏళ్ల క్రితం నాటిన జమైకా ఆపిల్ చెట్టు ఉంది. దీనికితోడు ఆ మొక్క పూలనుంచి ఎర్రని పుప్పుడులు కిందికి పడటంతో చెట్టుకింద ఎర్రని తివాచీగా పరచినట్టు ఉంది చూపరులను ఆకర్షిస్తోంది. చూసేందుకు వాటర్యాపిల్లా ఉన్నప్పటికి దీని రుచి కమ్మగా ఉంటుంది. జమైకా ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న జమైకా ఆపిల్ బలమైన ఎముకలు, దంతాలను నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు.

జమైకా హ్యాపిల్!