
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,34,020 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.