
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. రౌతులపూడి గ్రామానికి చెందిన మోర్త రమేష్‌బాబు, గెడ్డ ప్రతాప్ మెరక చామవరం బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా రౌతులపూడి శివారు మరిడమ్మ తల్లి గుడి వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న మోర్త రమేష్‌బాబు (15) రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన రమేష్‌ను రౌతులపూడి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. మృతుడికి తల్లి సత్యవతి, తండ్రి నాగేశ్వరరావు, సోదరుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.