ఐ.పోలవరం మండలం గోగుల్లంకలో సర్వే నంబర్ 603 నుంచి 612 వరకూ సీఆర్‌జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువుల తవ్వకాలు చేపట్టారు. అక్రమ ఆక్వా చెరువుల కాలుష్యం వల్ల పంట చేలు, కొబ్బరి తోటలకు ముప్పు ఏర్పడుతోంది. దీనిపై రెండు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాను. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ఫిర్యాదు చేశా.
– నడింపల్లి భరత్, రైతు, గోగుల్లంక,
ఐ.పోలవరం మండలం
ముంపు సమస్య పరిష్కరించాలి
పేరూరు ఎఫ్‌సీఐ గోడౌన్స్ వద్ద లంక తోట శివారు 96 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు, వరదలకు డ్రైనేజీలో ముంపు వల్ల చేలు దెబ్బ తింటున్నాయి. జమీందారు ఇంటి సమీపాన డ్రెయిన్ వద్ద ఉన్న లాకు షట్టర్లు పాడైపోయాయి. ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞాపన చేసుకున్నాను.
– డేగల వెంకట రమణ పేరూరు లంకతోట, అమలాపురం మండలం
అమ్మ పింఛన్ తొలగించారు
మా అమ్మ అక్షింతల సుబ్బరామలక్ష్మి కొత్తపేట మండలం పలివెలలో ఉంటారు. ఆమెకు వితంతు పింఛన్ వస్తోంది. అమ్మకు ఇటీవల తలకు, వెన్నెముక ఆపరేషన్ చేయించాం. ఆ సమయంలో మా ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవడంతో మూడు నెలల పాటు ఫించన్ తీసుకోలేదు. దీనిని సాకుగా చూపించి పింఛన్ తొలగించారు. దీనిని పునరుద్ధరించాలని పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చాం.
– కె.లలిత, రామలక్ష్మి,
పలివెల, కొత్తపేట మండలం
సమస్య పరిష్కారం కాలేదు
సమస్య పరిష్కారం కాలేదు