
సానుకూల దృక్పథం అవసరం
ఎటువంటి ప్రశ్నలకై నా సమాధానాలు రాయగలననే సానుకూల దృక్పథాన్ని విద్యార్థులు కలిగి ఉండాలి. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే తరువాతి పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేరు. పరీక్షకు వెళ్లే ముందు వజ్రాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటే ఎటువంటి ఒత్తిడినైనా అధిగమించవచ్చు. పరీక్షలకు ముందు అలసట, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. కనీసం ఆరు గంటల నిద్ర అవసరం. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రివిజన్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి.
– డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం
●