అమలాపురం టౌన్: కోనసీమ పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఉదయం స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి సర్వం సిద్ధం చేసింది. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు నిర్మించి, లోపల ఇంటీరియల్ డెకరేషన్ చేయించారు. వేల మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేలా కుర్చీలు ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదికను మామిడి తోరణాలు, పూల దండలతో అలంకరించారు. శుక్రవారం జరిగే స్వామివారి తీర్థం, రథోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ చైర్ పర్సన్ దూడల వెంకట విరీతాదేవి, ఈవో దూనబోయిన సాయిబాబు,ధర్మకర్తలు, అర్చకులు పర్యవేక్షిస్తున్నారు.