
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు: భార్యపై దాడి చేశాడు. ఆమె స్పృహ తప్పడంతో మృతిచెందిందని భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా పది నిమిషాల తర్వాత తేరుకున్న భార్య.. భర్త ఉరికి వేలాడుతుండడాన్ని చూసి బోరున విలపించింది. ఈ ఘటన అంబత్తూరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొరటూరు, అగ్రహారానికి చెందిన కుమార్ (40) పెయింటర్. భార్య దుర్గ (36). సోమవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన కుమార్ భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దుర్గ స్పృహ తప్పింది. చనిపోయిందని భావించిన కుమార్ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.