మరదలిపై అనుమానం.. చంపి, శవాన్ని.. | Man Assassinated Sister In Law Over Suspicion | Sakshi
Sakshi News home page

మరదలిపై అనుమానం.. చంపి, శవాన్ని..

Apr 12 2021 5:41 PM | Updated on Apr 12 2021 5:44 PM

Man Assassinated Sister In Law Over Suspicion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో మరదల్ని హత్య చేశాడో బావ. ఈ సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కూకట్‌పల్లి ఏవీబీపురంలో నివాసం ఉంటున్న భూపతి అనే వ్యక్తి మరదలిపై అనుమానంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోవాల్సిన తనతో కాకుండా ఇతరులతో తిరుగుతోందని అనుమానించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని నీటి సంపులో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే చావటానికి ధైర్యం చాల్లేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement