Bangalore Crime News Telugu: Man Molested Wife Sister Made Her Pregnant - Sakshi
Sakshi News home page

ఇంటికొచ్చిన భార్య చెల్లెలిని లోబర్చుకుని.. ఏడు నెలలకే..

Feb 7 2022 3:40 AM | Updated on Feb 7 2022 10:40 PM

Bangalore: Man Molested Wife Sister Made Her Pregnant - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శివమొగ్గ: భార్య చెల్లెలు అయిన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన ఘరానా బావను జిల్లాలోని కుంసి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరె స్టు చేశారు. అక్క–బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న బాలికను బావ కన్నబిడ్డలా చూసుకోవడానికి బదులు కన్నేశాడు. మాయమాటలు చెప్పి లైంగికవాంఛలు తీర్చుకుంటూ ఉన్నాడు. ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలిక ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు.

బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి గొడవ లేకుండా ఇంటికి తీసుకొచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మృతి చెందింది. పోలీసులు బావను కటకటాల్లోకి తరలించారు.

తీర్థహళ్లిలో మరో కేసు: తీర్థహళ్ళి పట్టణంలో మరో పోక్సో కేసు నమోదైంది. తాపీ పని చేయడానికి వచ్చిన యువకుడు స్థానిక బాలికతో పరిచయం పెంచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితున్ని అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement