
మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
సీజనల్ వ్యాధులపై ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు.
నష్టాల ఊబిలో రైతన్నలు
మామిడిని కొంటాం
జిల్లాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ హామీ ఇచ్చారు.
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
పలమనేరు: ‘ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం దేనికని?. అంత బెదురెందుకని..’ అంటూ రాష్ట్ర మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మామిడికి గట్టుబాటు ధర కోసం ఈనెల 9న బంగారుపాళెంకు వస్తున్న సందర్భంగా పలమనేరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జిల్లా నేతలతో ఆయన శనివారం సన్నాహక సమావేశాన్ని నేర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పొగాకు, మిరప, టమాట రైతులు నష్టాల్లో కూరుకుపోయారని వాపోయారు. ఇప్పుడు మామిడి రైతులు కూడా ఆ కోవలో చేరారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడిని అమ్ముకోలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతమన్నారు. పొరుగునే ఉన్న కర్ణాటకలో రైతులకు అక్కడి ఎంపీ కేంద్రానికి లేఖ రాసి వారిని ఆదుకున్న విషయం తెలిసిందేనన్నారు. కానీ కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన నేతలు ఇక్కడి మామిడి రైతుల కష్టాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రాల్లో మరింత మెరుగ్గా మామిడి ధరలు
బంగారుపాళెం: రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి మరింత ధారుణంగా మారిందన్నారు. తోతాపురి మామిడికి ధర లేక అవస్థలు పడుతున్నట్టు వాపోయారు. కర్ణాటకలో మామిడి రైతుల కోసం జేడీఎస్ పార్టీ నాయకుడు లేక రాస్తే 2.60 లక్షల టన్నుల మామిడి కాలయను కిలో రూ.16తో కొలుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన ధరకు వ్యాపారులు, గుజ్జుపరిశ్రమ యజమానులు మామిడిని కొనుగోలు చేయడం లేదన్నారు. కిలో రెండు రూపాయలకు ధర పడిపోయిందన్నారు. దీంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టు మిట్టాడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.25 వేలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మామిడి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికిందని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. రైతు భరోసా కేందాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి ఆదుకుందని పేర్కొన్నారు.
బాబు మోసాలను ఎండగట్టాలి
సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అందించలేదని ఆరోపించారు. మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు అల్లాడుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ అనే నినాదంతో ప్రతి గ్రామానికి నాయకులు, కార్యకర్తలు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయరెడ్డి, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల పార్టీ కన్వీనర్లు రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కన్వీనర్లు సోమశేఖర్, ప్రతాప్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, రాజారత్నం రెడ్డి, జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి గోహతిసుబ్బారెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, వడ్డెర, ఈడిగ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మొగిలీశ్వర్, ఎల్లప్ప, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు దత్తా త్రేయరెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ప్రకాష్‌రెడ్డి, గోవిందరాజులు, శరత్‌రెడ్డి, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ సింహారెడ్డి, పలువురు మండల పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలమనేరులో మాట్లాడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
‘వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే సీఎం చంద్రబాబుకు వణుకుపుడుతోంది. అందుకే ఆయన పర్యటనలకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా మా నాయకుడు జిల్లాకు వచ్చి తీరడం ఖాయం. హెలీప్యాడ్‌కు కూడా అనుమతివ్వడం లేదు. అందుకనే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళెం చేరుకుంటారు. మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తారు..’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
విద్యాశాఖలో
ఇద్దరికి ఉద్యోగోన్నతులు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు డీఈఓ వరలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రెడ్డిశేఖర్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి కల్పించారు. ఆయనకు అన్నమయ్య జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎంఆర్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న వనజకు ఉద్యోగోన్నతి కల్పించి తిరుపతి పాఠ్యపుస్తకాల గోడౌన్ లో పోస్టింగ్ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఒంటరి ఏనుగు బీభత్సం
గంగవరం: మండలంలోని కీలపట్ల పంచాయతీ, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి పంట పొలాలపై ఒంటరి ఏనుగు దాడికి తెగబడింది. గ్రామానికి చెందిన రైతు అమ్ములు వ్యవసాయ పొలంలో టమాట పంటతో పాటు వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేసింది. ఏనుగుల కట్టడికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
బీసీ వసతి గృహం
అభివృద్ధికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులతో జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీబాషా తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో సీఎస్‌ఆర్ నిధులతో పలు ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో రూ.12.80 లక్షలు సంజయ్ గాంధీ నగర్ బీసీ వసతి గృహం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ వసతి గృహంలో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, ఆర్‌వో వాటర్ ప్లాంట్లు, ప్లంబింగ్ పనులు, వంటగది ఉపకరణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆక్వా కల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్లాంట్ జనరల్ మేనేజర్ సకరన్ సనజాక్, ఇతర సిబ్బంది గోపీనాథ్, అక్రమ్, మాధవరావు, ఏబీసీడబ్ల్యూవో వాసంతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పర్హానబేగం, కోటేశ్వరరావు, ఉమాదేవి, కరుణ తదితరులు పాల్గొన్నారు.
నాకు న్యాయం చెయ్యండి
నగరి : సహకార సంఘంలో రుణం తీసుకొని తిరిగి చెల్లించినా తనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఎస్.వేలు శనివారం నగరి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్‌కు స్పందనలో ఇచ్చిన అర్జీ మేరకు విచారణ అధికారిగా ఉన్న నగరి పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి కేవీఆర్ కుమార్‌కు వినతిపత్రం అందించడానికి విచ్చేసిన ఆయన తన ఆవేదనను మీడియాకు వెల్లడించారు. కోసలనగరం సింగిల్ విండో సొసైటీ బ్యాంక్‌లో రుణం తీసుకుని దానిని పూర్తిగా చెల్లించినా.. బ్యాంకు ఇన్‌చార్జి సీఈవో తనకు నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
5,098 కేసుల
పరిష్కారం
చిత్తూరు అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 5,098 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం నిర్వహించిన అదాలత్‌లో సివిల్ కేసులు 271, క్రిమినల్ 4687, ప్రిలిటిగేషన్ 140 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కోర్టుల వారీగా చూస్తే చిత్తూరులో 1,472, తిరుపతి 2,242, మదనపల్లి 44 , పీలేరు 72, శ్రీకాళహస్తి 268, పుత్తూరు 34, పుంగనూరు 69, పలమనేరు 235, కుప్పం 67, పాకాల 132, నగరి 109, సత్యవేడు 217, వాయల్పాడు 41, తంబళ్లపల్లిలో 96 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు.
– భగ్గుమంటున్న యూటీఎఫ్ నేతలు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఈనెల 10వ తేదీన చేపట్టబోయే మెగా పీటీఎం సమావేశాలను పరిశీలించేందుకు విట్‌నెస్ (పరిశీలన) అధికారులెందుకని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్‌నాయుడు, మణిగండన్ ప్రశ్నించారు. ఈ మేరకు పలు డిమాండ్‌లను పరిష్కరించాలంటూ ఆ సంఘ నాయకులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో విట్‌నెస్ అధికారిని నియమించడం అవమానకరంగా ఉందన్నారు. ఆ అధికారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని వారిచేత వీడియోలు తీయించి అప్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారని, వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని వింత నిర్ణయాలు ఇప్పుడెందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. టీచర్లను అవమానించేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం భావ్యం కాదన్నారు.
ఇది పీటీఎం కాదు డాక్యుమెంట్ కార్యక్రమం
కూటమి ప్రభుత్వం పీటీఎం కార్యక్రమాన్ని డాక్యుమెంట్ కార్యక్రమంగా మార్చడం సరికాదని ఆ సంఘ నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల విద్యాభివృద్ధి అంశం పై చర్చించే కార్యక్రమంగా మార్చాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోపే యోగా పేరుతో వారం రోజులు, పీటీఎం పేరుతో మరో వారం రోజులు బోధన సమయాన్ని హరిస్తున్నారని విమర్శించారు. టీచర్లను బోధనకు పరిమితం చేయకుండా, బోధనేతర కార్యక్రమాల పేరుతో ఒత్తిడికి గురి చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్
బంగారుపాళెం రావడం ఖాయం
మామిడి రైతులకు అండగా నిలవడం తప్పా?
హెలీప్యాడ్‌కు కూడా అనుమతివ్వకుండా ఆంక్షలా?
మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఇలా..
ఈనెల 9న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో కోలారు, ముళబాగిళు, ఏపీ బోర్డర్ గండ్రాజుపల్లి, నాలుగు రోడ్లు, పలమనేరు బైపాస్ మీదుగా బంగారుపాళెంకు చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, జిల్లా ఎంపీపీల సంఘ అధ్యక్షుడు మొగసాల రెడ్డెప్ప, వైఎఎస్సార్‌సీపీ పలమనేరు పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్డీ మురళీకృష్ణ, చెంగారెడ్డి, దయానంద్‌గౌడ, నియోజకవర్గ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ అనుభంద విభాగాల నాయకులు పాల్గొన్నారు.
నేడు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, టమాట వంటి పంటలు పండించిన రైతులు ధరలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని వాపోయారు. సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాక అవస్థలు పడుతున్నట్టు వెల్లడించారు.
మామిడికి వెన్నుదన్ను
మామిడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్‌రాజా స్వగృహంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఆయన సమావేశమయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బంగారుపాళెం మామిడి మార్కెట్ యార్డుకు విచ్చేయనున్నట్టు తెలిపారు. తర్వాత మామిడి రైతుల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి మద్దతుగా నిలిచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
హెలీప్యాడ్‌కు అనుమతులివ్వడం లేదు
ప్రతిపక్ష నేతగా మామిడి రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటకు హెలీప్యాడ్‌కు సైతం అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఏపీలో భారత రాజ్యాంగంకాకుండా రెడ్‌బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. అసలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికై నా వస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఎందుకు అంతలా వణికిపోతోందే అర్థం కావడం లేదన్నారు. మొన్నటి దాకా తోతాపురి మామిడికి ధరలేక రైతులు కాయలు అమ్ముకోలేక తోపుల్లో వదిలేస్తున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నాడని తెలిసి మామిడిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే జగన్‌మోహన్‌రెడ్డి వస్తేగానీ రైతుల కష్టం ఈ ప్రభూత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.

మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?

మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?

మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?

మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?

మెగా పీటీఎంకు పరిశీలన అధికారెందుకు?