వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు

Jul 6 2025 6:42 AM | Updated on Jul 6 2025 6:42 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్‌ టీయూసీ జనరల్‌ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్‌ నెల్లూరుకు చెందిన వి.సుందర్‌ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్‌), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్‌ రెడ్డిను నియమించారు.

వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు

వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన నలుగురిని ప్రకటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్‌.చెంగారెడ్డి, ఎస్‌డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్‌ సిరాజ్‌బాషా ఉన్నారు.

కూసాలు ధ్వంసం

పులిచెర్ల(కల్లూరు): మండలంలోని చల్లావారిపల్లె సమీపంలో శనివారం తెల్లవారు జామున ఏనుగుల గుంపు డా.చంద్రబాబు మామిడి తోపులో, తోపు చుట్టూ ఉన్న 48 ముళ్ల కూసాలను ధ్వంసం చేశాయి. అలాగే చుట్టు పక్కల ఉన్న వరి పంటను తొక్కి నాశనం చేశాయి.

సాహిత్య పురస్కారాలకు ఎంపిక

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరానికి చెందిన సంధ్యా శర్మ రాసిన సంధ్యా సమీరాలు(కవిత్వం) కవితా సంపుటి విశాలాక్షి సాహిత్య పురస్కారాలకు ఎంపికై ంది. పలు కవితా సంపుటి ఆమె పలు పురస్కారాలకు పంపారు. ఈ క్రమంలో సంధ్యా సమీరాలు అనే సంపుటి విశాలాక్షిని మెప్పించింది. నెల్లూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన జరిగే కార్యక్రమంలో పురస్కారం అందుకోనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.

రైలు కింద పడి

యువకుడి ఆత్మహత్య

పుత్తూరు: పట్టణ పరిధిలోని మరాఠి రైల్వే గేట్‌ సమీపంలో శనివారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేణిగుంట రైల్వే ఎస్‌ఐ రవి కథనం మేరకు.. నాగలాపురం మండలం, కృష్ణాపురం గ్రామానికి చెందిన కె.దేశయ్య కుమారుడు డి.శరత్‌(30) డిప్లోమా చేసి చైన్నెలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పుత్తూరులోని సమీప బంధువుల ఇంటికి 15 రోజుల క్రితం వచ్చిన శరత్‌ మానసిక వేదనతో బాధపడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు  
1
1/1

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement