
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
శ్రీరంగరాజపురం : మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కళ్యాణ మండపంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ స్థాయిలో రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇన్‌చార్జి కృపాలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి మండలానికి చెందిన దివాకర్, శ్రీను, మదన్‌కుమార్, వెదురుకుప్పం మండలం నుంచి ధనరాజ్ వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ఏడాదికే కూటమి పాలన అరాచకం, దౌర్జన్యం తట్టుకోలేక టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు. రానున్న రోజుల్లో మరింత చేరికలు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, మాజీ కన్వీనర్ అనంతరెడ్డి, జిల్లా క్రియాశీలక కార్యదర్శి విజయబాబు, కుప్పయ్య, సర్పంచ్ డిల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు కోటిరెడ్డిబాబు, నాయకులు పాల్గొన్నారు.