
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లె : పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం కాటిపేరిలో చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాటిపేరికు చెందిన సుబ్రమణ్యం(45) కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్థాపం చెంది పురుగుమందు తాగి అపస్మారకస్థితిలో వెళ్లగా కుటుంబ సభ్యులు గుర్తించి 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు(చౌడేపల్లె) : పట్టణంలోని అంబేడ్కర్ భవనం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బుధవారం స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుడి వివరాలపై ఆరా తీశారు. మృతుడు బిక్షాటన చేసుకుంటూ అంబేడ్కర్ సర్కిల్ వద్ద తలదాచుకునేవాడని తెలిపారు. మృతదేహాన్ని పుంగనూరు ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పుంగనూరు పోలీసులను సంప్రదించాలని సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
విచారణ నివేదిక.. తప్పుల తడక
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తన కుమార్తె శ్రీదుర్గ మృతి విషయంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని బీసీ నాయకులు షణ్ముగం ఆరోపించారు. చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తన కుమార్తె శ్రీదుర్గ రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తే.. సరైన చికిత్స అందక మృతి చెందిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఆయన పేర్కొన్నారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం