
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
పుంగనూరు(చౌడేపల్లె): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 18 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల నిరసనలకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చి సంఘీభావం ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయకుండా ఆరాచకాలు, అక్రమాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో, గొంతెత్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. సూపర్ –6ను అమలు చేయాల్సిన ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు, కౌన్సిలర్లు సాజిదాబేగం, రేష్మా, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇర్ఫాన్, కొండవీటి నరేష్, ఖాదర్‌బాషా, రాజేష్, కార్మికులు కుమార్, గోపి, దౌలత్, సంతోష్, శివకుమార్, మోహన్, సోము, వెంకట్రమణ, యూసుఫ్, జావహార్‌అలి పాల్గొన్నారు.
భిక్షాటన అనే పదాన్ని తొలగించారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దాసరుల కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన అనే పదాన్ని తొలగించడం స్వాగతించదగ్గ విషయమని దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రంలో దాసరులకు భిక్షాటన అనే పదాన్ని చేర్చే వారని, ఈ పదం తమ మనో భావాలనులను దెబ్బతీసే విధంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పదాన్ని తొలగించేలా చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. దాసరి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వెంకట రమణ, సుబ్బయ్య, జయచంద్ర, శేఖర్, మధు పాల్గొన్నారు.