
కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
గంగవరం: బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గంగవరం ఫ్లైఓవర్ పైన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. అర్బన్ సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు.. పలమనేరు పట్టణం, ఆర్‌కే స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న మస్తాన్(44), గంగవరం మండలం, మేలుమాయి క్రాస్‌కు చెందిన రితిక(20) ఇద్దురూ కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరి వెళ్లారు. గంగవరం బైపాస్‌లో రాంగ్ రూట్‌లో నిర్లక్ష్యంగా బైక్‌ను నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అదే దారిలో బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును అదే మార్గంలో అజాగ్రత్తగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా వెనుక కూర్చున్న యువతికి తీవ్రంగా గాయపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్‌తో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కేసు దర్యాప్తులో ఉంది.
ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనానంతరం స్వగ్రామానికి భక్తులతో వెళ్తున్న ఆటో చౌడేపల్లె– బోయకొండ మార్గంలోని జూనియర్ కళాశాల సమీపంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. సోమల మండలం, నంజంపేటకు చెందిన కొందరు ఆటోలో బోయకొండకు వెళ్లారు. గంగమ్మను దర్శించుకొని ఇంటికి బయలు దేరారు. జూనియర్ కళాశాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న అహమ్మద్, విజయ్, రమణ, పాపయ్యతోపాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం

కారును ఢీకొన్న ద్విచక్ర వాహనం