
ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ మరోసారి బైక్ లవర్స్‌కు షాకిచ్చింది. టీవీఎస్ అపాచీ బైక్ ధరలను గణనీయంగా పెంచింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి, అపాచీ ఆర్టీఆర్ 160 4వి ధరలను టీవీఎస్ భారీగా పెంచింది. ఈ ఏడాదిలో అపాచీ బైక్ల ధరలను టీవీఎస్ పెంచడం ఇది మూడోసారి. అపాచీ ఆర్టీఆర్ 160 4వి వేరియంట్ ధరను సుమారు రూ. 3000 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 160 4వి డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,14,615 కాగా, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర సుమారు రూ. 1,11,565 గా ఉంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వి వేరియంట్ ధరను రూ. 3,750 వరకు పెంచింది. దీంతో అపాచీ ఆర్టీఆర్ 200 4వి సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,33,065 కాగా, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ట్రిమ్ వేరియంట్ ధర రూ. 1,38,115 గా ఉంది. పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రాంతంలోనే వర్తిస్తాయి. ఆయా ప్రాంతాలను బట్టి బైక్ ధరల్లో మార్పులు ఉండవచ్చును.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది.