
సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) సమావేశంతో పాటు గత వారం కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతాయని నిపుణులు అంచనా వేశారు.
కానీ అందుకు భిన్నంగా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.22 గంటల సమయానికి సెన్సెక్స్ 349.73 పాయింట్లు నష్టపోయి 58666 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 106.90 పాయింట్లు నష్టపోయి 17478.30 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
హెచ్‌యూఎల్, ఐటీసీ,ఓన్‌జీసీ,దివీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే, టీసీఎస్ షేర్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా.. నెక్ట్స్ మీడియా నెట్ వర్క్, సుమయా ఇండియా, పార్ డ్రగ్స్, ఎక్స్‌ప్రో ఇండియా, జిందాల్ పాలి ఐఎన్‌వీ, కాలిఫోర్నియా సాఫ్ట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.