వణికిస్తున్న ఆర్ధిక మాంద్యం..మరో బిజినెస్‌ను మూసేసిన స్విగ్గీ

Swiggy Shut Down The Bowl Company In Delhi-ncr - Sakshi

జనాలా చేత డబ్బులు ఖర్చు పెట్టిచ్చే బిజినెస్‌ చేస్తున్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ..రెసిషన్‌ ముంచుకొస్తోంది. డబ్బులు ఆదా చేసుకోండని సలహా ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ బెజోస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే? ఆయన చేసేది కూడా వ్యాపారమే. కానీ వ్యాపార వేత్తలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.  

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్ధిక మాంద్యం దెబ్బకు క్లౌడ్‌ కిచెన్‌ బ్రాండ్‌ ది బౌల్‌ కంపెనీని షట్‌ డౌన్‌ చేసింది.ఎందుకంటే? ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా తన మేజర్‌ బిజినెస్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ విభాగంలో నష్టాలు పెరుగుతున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకంటూ, ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకక తప్పలేదని చెప్పిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

స్విగ్గీ మాత్రం క్లౌడ్‌ కిచెన్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఊహించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేదు.కాబట్టే ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లలో మాత్రమే ఈ బిజినెస్‌ను క్లోజ్‌ చేస‍్తున్నట్లు తెలిపింది. ఇక బెంగళూరు, చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల్లో ది బౌల్ కంపెనీని పెట్టుబడులు పెట్టడం,అభివృద్ధి చేయడాన్ని కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. 

బౌల్ కంపెనీతో పాటు, స్విగ్గి బ్రేక్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, హోమ్లీ వంటి బ్రాండ్‌లను నిర్వహిస్తోంది. ఈ విభాగాల్లో స్విగ్గీ గణనీయమైన లాభాల్ని గడిస్తున్నట్లు తేలింది. గత వారం, కంపెనీలో 33 శాతం వాటాను కలిగి ఉన్న స్విగ్గీ ఇన్వెస్టర్ ‘ప్రోసస్’ 2022 మొదటి 6 నెలల కాలంలో అమ్మకాలు, గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) పరంగా సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించిందని చెప్పింది. ప్రోసస్ నివేదిక ప్రకారం.. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఫుడ్ డెలివరీ వ్యాపారం 38 శాతం, జీఎంవీ విలువ 40 శాతం పెరిగింది.

క్లౌడ్‌ కిచెన్‌ అంటే 
బ్యాచిలర్లు, కాలేజీ స్టూడెండ్స్‌, వ్యాపారాలతో తీరికలేని వాళ్లు స్విగ్గీ, జొమాటో, ఉబర్‌ ఈట్స్‌..లాంటి యాప్స్‌లో ఆర్డర్‌ పెట్టుకొని నచ్చిన రుచులను ఇంటికే తెప్పించుకుని ఆరగిస్తుంటారు. ఫుడ్‌ బాగుంటే ప్రతి సారి ఆ హోటల్‌ నుంచి తెప్పించుకొని తినడమే, లేదంటే వీలైనప్పుడు నేరుగా వెళ్లి తిని వస్తుంటారు. కానీ ఈ క్లౌడ్‌ కిచెన్‌ విభాగంలో అలా తినేందుకు వీలుపడదు. పైన మనం చెప్పుకున్నట్లుగా స్విగ్గీ ది బౌల్‌లాంటి క్లౌడ్‌ కిచెన్‌ సంస‍్థలు దేశంలోని ఆయా ప్రాంతాల్లో వంట చేసేలా పెద్ద పెద్ద గ్యాస్‌ స్టవ్‌లూ, ఫ్రిజ్‌లూ, ఓవెన్‌లూ, స్టోర్‌ రూమ్‌లూ, వంటసామానూ ఇలా అన్నీ అందుబాటులో ఉండేలా ఈ క్లౌడ్‌ కిచెన్‌లను అద్దెకు తీసుకుంటాయి. కస్టమర్లు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను అప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తుంటాయి. దీన్నే క్లౌడ్‌ కిచెన్‌ అంటారు. ఒక్క ముక్కలో చెప్పలాంటే మీకు కావాల్సిన ఆహార పదార్ధాలన్నీ దొరుకుతాయి. కానీ రెస్టారెంట్ల తరహాలో కూర‍్చొని తినేందుకు వీలుండదు.

చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్‌ 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top