
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకుని కీలక మద్దతుస్థాయిలకుపైన పటిష్టంగా కదలాడినా చివరికి నష్టాలు తప్పలేదు. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టపోయాయి. ఆయిల్ సెక్టార్ 3 శాతం ఆటో, ఐటీ, ఫైనాన్షియల్స్, మెటల్స్ ఒక్కొక్క శాతం చొప్పున క్షీణించాయి. చివరికి సెన్సెక్స్ 111 పాయింట్ల నష్టంతో 52910 వద్ద నిఫ్టీ 28 పాయింట్లు క్షీణించి 15752 వద్ద ముగిసాయి. అయితే సెన్సెక్స్ 53 వేల స్థాయిని కోల్పోయినప్పటికీ డే కనిష్టం ఏకంగా 800 పాయింట్లు ఎగియడం గమనార్హం.
మరోవైపు ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్నిపెంచడంతో ఆయిల్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ 7 శాతం పతనమైంది. ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా లాభపడ్డాయి.