ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఏకంగా 50 శాతం తగ్గింపు!

SBI YONO Super Saving Days LIVE NOW: Check Top Deals, Offers - Sakshi

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. ఈ కామర్స్ వ్యాపార సంస్థలకు దీటుగా ప్రత్యేకంగా 'యోనో సూపర్ సేవింగ్ డేస్' పేరుతో సరికొత్త సేల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ సేల్ జూలై 4న నుంచి జూలై 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 'యోనో సూపర్ సేవింగ్ డేస్' సేల్లో భాగంగా టైటన్‌పేపై 20 శాతం తగ్గింపు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే అపోలో 24/7లో 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈజీమైట్రిప్‌లో 10 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఓయో ద్వారా ఏకంగా 50 శాతం తగ్గింపు పొందే అవకాశం ఎస్‌బీఐ మీకు కల్పిస్తోంది.

టాటా క్లిక్‌లో అయితే రూ.300 వరకు బెనిఫిట్‌ పొందవచ్చు అని తెలిపింది. వేదాంతులో 50 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. అయితే ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా జరిపే చెల్లింపులకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది. "తన వినియోగదారులకు అంతిమ షాపింగ్ ఆనందాన్ని అందించడానికి యోనో వేదాంతు, అపోలో 24ఐ7, ఈస్ మైట్రిప్, ఓయో వంటి అగ్ర శ్రేణి వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి ఉంది" అని ఎస్‌బీఐ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top