Net direct tax collection reaches Rs 13.73 lakh crore - Sakshi
Sakshi News home page

13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Published Sat, Mar 11 2023 2:16 PM

Net Direct Tax Collection Reaches Rs 13.73 Lakh Crore - Sakshi

దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  (cbdt) తెలిపింది.  

 ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్‌లు జారీ అయ్యాయి.  ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్‌ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ పేర్కొంది.  

స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్‌ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్‌టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది.

Advertisement
Advertisement