హెల్త్‌ కేర్‌ రంగానికి ‘జీఎస్‌టీ’ ఊరట ఇవ్వండి

Nathealth Healthcare Recommendations To The Government For The Union Budget 2023-24 - Sakshi

న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) భారం తగ్గించాలని హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీ వేదిక– నట్‌హెల్త్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే చిన్న నగరాలు, పట్టణాలలో ప్రజలకు మెరుగైన బీమా కవరేజీని కల్పించే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు 2023–24 బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని నట్‌హెల్త్‌ ప్రెసిడెంట్‌ శ్రావణ్‌ సుబ్రహ్మణ్యం కోరారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రీ–బడ్జెట్‌ నివేదిక పత్రంలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

► ఇతర రంగాల తరహాలో ఆరోగ్య సంరక్షణ రంగం జీఎస్‌టీ పరివర్తన ప్రయోజనాలను పొందలేకపోయింది.
 
►వాస్తవానికి, జీఎస్‌టీ ముందు కాలంతో పోలిస్తే, అనంతర కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో పన్నులు పెరిగాయి. 

►పూర్తి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లను క్లెయిమ్‌ చేసుకునే అవకాశంతో అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ( ప్రభుత్వ, ప్రైవేట్‌) అవుట్‌పుట్‌ హెల్త్‌కేర్‌ సేవలపై 5 శాతం మెరిట్‌ రేటును విధించాలి. అలాగే అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల కోసం అవుట్‌పుట్‌ సేవలపై 5 శాతం జీఎస్‌టీ రేటును దీనిపై  ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఐచ్ఛిక డ్యూయల్‌ రేట్‌ స్ట్రక్చర్‌ను విధించవచ్చు. 

►ప్రస్తుతం ఆరోగ్య సేవలపై జీఎస్‌టీ మినహాయింపు ఉంది. అయితే ఈ సేవలపై 5 మెరిట్‌ రేటును విధించవచ్చు. దీనివల్ల హెల్త్‌కేర్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసుకోవడానికి వీలుకలుగుతుంది.  తద్వారా వారి ఎంబెడెడ్‌   (ఉత్పత్తి లేదా సేవ మూల ధర ను పెంచే పన్ను) పన్నుల భారం తగ్గుతుంది. 

►ప్రొవైడర్లు, ప్రొక్యూర్‌మెంట్‌ సంస్థలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ బకాయిలనూ క్లియర్‌ చేయాలి.  

►ప్రజలు నాణ్యమైన,  క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు తగిన రీతిన పొందడానికి మౌలిక సదుపాయాల సామర్థ్యాల పెంపు, విస్తరణ అవసర. టైర్‌–1, టైర్‌–2 నగరాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అవసరం.  ఇది హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.  

►ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పూర్తి స్థాయిలో విస్తరణ మరో కీలక అంశం.   

►ఇన్సూరెన్స్, పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద ప్రొవైడర్లు అలాగే సప్లయర్‌ల కోసం అన్ని పేమెంట్‌ బ్యాక్‌లాగ్‌లు క్లియర్‌ చేయాలి. అది హెల్త్‌కేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పురోగతి, లభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. 

►ఆరోగ్య రంగానికి బడ్జెటరీ కేటాయింపులు భారీగా పెరగాలి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top