బిట్‌ కాయిన్లతో, మెక్‌ డొనాల్డ్స్‌ కీలక నిర్ణయం

Mcdonald Reportedly Begun To Accept Bitcoin And Asset Backed Stablecoin - Sakshi

 ప్రముఖ దిగ్గజ ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్థ మెక్‌ డొనాల్డ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  కస్టమర్లు బిట్‌ కాయిన్‌లతో బిల్‌ పేమెంట్స్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

స్విట్జర్లాండ్‌ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్‌ కాయిన్ టెథర్‌ చెల్లింపులకు మెక్‌ డొనాల్డ్స్‌ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా  డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్‌ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 

బిట్‌ కాయిన్‌ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ లవర్స్‌ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్‌ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top