అదిరిపోయిన మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల టీజర్..!

Mahindra Teases 3 New EV Concepts, Unveil In July 2022 - Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఆలస్యంగానైనా అదిరిపోయే రీతిలో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంది. గత ఏడాది తన ప్రతిష్టాత్మక బోర్న్ ఎలక్ట్రిక్ వేహికల్ ఫ్లాట్ ఫారాన్ని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫారం వేదికగా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్దం అవుతుంది. ఈ ఏడాది జూలైలో 'బోర్న్ ఎలక్ట్రిక్ విజన్'ను ఆవిష్కరించనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది. 

బోర్న్ ఈవీ ప్లాట్ ఫామ్ కింద కంపెనీ త్వరలో తీసుకొని రాబోయే ఎలక్ట్రిక్ కార్లను టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ వీడియోలో మూడు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యువీలను చూపించింది. ఈ ఎలక్ట్రిక్ కార్లను రాబోయే ఎక్స్‌యువీ 300, ఎక్స్‌యువీ 700, ఎక్స్‌యువీ 900 ఆధారంగా తయారు చేయవచ్చు అని సమాచారం. ఈ రాబోయే ఈవీలను యుకెలోని గ్లోబల్ డిజైన్ సెంటర్ మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరోప్(మేడ్) రూపొందించినట్లు టీజర్ వెల్లడించింది. గత సంవత్సరం, ఎం అండ్ ఎం తన రాబోయే ప్యాసింజర్ కార్ల కోసం ఒక రోడ్ మ్యాప్ విడుదల చేసింది. వీటిని మొదట 2025, 2026 మధ్య ప్రారంభించాల్సి ఉంది. అయితే, కంపెనీ అతి త్వరలో బయటకు తీసుకువస్తారని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న పెట్రోల్, డీజిల్ వాహనాల ఆధారంగా త్వరలో మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తుంది. 

(చదవండి: మరోసారి టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top