ఎల్ఐసీ పాలసీదారులకు బంపరాఫర్..!

LIC policyholders may get its shares at a discount - Sakshi

ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఐపీవోలో పాల్గొనే  పాల‌సీదారుల‌కు ఎల్ఐసీ బంఫ‌ర్ ఆఫ‌ర్ ప్రకటించింది. ఐపీవోలో 10 శాతం డిస్కౌంట్ తో పాల‌సీ దారుల‌కు తగ్గింపు తో రానుంది.

ప్రభుత్వం ఈ వారం ముసాయిదా రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) లేదా ఆఫర్ డాక్యుమెంట్‌ను ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నందున, ప్రభుత్వ-ఆధారిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) రాబోయే ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) దాని మిలియన్ల కొద్దీ పాలసీదారులకు తగ్గింపుతో రావచ్చునని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు. 

రిటైల్ విండో కింద పాలసీదారులకు నిర్దిష్ట రిజర్వేషన్ను కేటాయిస్తున్నామని అన్నారు. LIC చట్టం ప్రకారం 10% వరకు ఇష్యూని పాలసీదారులకు పోటీ ప్రాతిపదికన కొంత తగ్గింపుతో అందించవచ్చని అందుకు కావల్సిన నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. పాలసీదారులకే కాకుండా సంస్ధ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ ఉంటుందని  చెప్పారు, రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు కూడా కొంత రాయితీని ఆశించవచ్చని తెలిపారు.  అయితే వారికి ఇచ్చే తగ్గింపు వివరాలు ఇవ్వడానికి పాండే నిరాకరించారు.

సామాన్యుల భాగస్వామ్యం ...
ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీఓలో సామాన్యులను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం ఉద్దేశించినందున చిన్న పెట్టుబడిదారులకు డిస్కౌంట్లను అందించే అవకాశం ఉంది. దింతో ఐపీఓ లో 5% నుంచి 10% మధ్య వారికి కేటాయింపు వుండే అవకాశం ఉంటుందని సలహాదారులు భావిస్తున్నారు.

కొత్త డైరెక్ట‌ర్ల నియామ‌కం
దేశంలోకెల్లా అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ‌కు గ‌త జూలైలో కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఐపీవో ద్వారా ఎంత వాటాను విక్ర‌యించాల‌న్న విష‌య‌మై కేంద్ర ఆర్థిక మంత్రి సార‌ధ్యంలోని క‌మిటీ ఖ‌రారు చేస్తుంది. ప్ర‌తిపాదిత ఐపీవోకు వెళ్ల‌డానికి వీలుగా ఫైనాన్స్ యాక్ట్‌-2022 ద్వారా ఎల్ఐసీ చ‌ట్టంలో ఇప్ప‌టికే కేంద్రం స‌వ‌ర‌ణ‌లు చేసింది. సెబీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తాజాగా ఆరుగురు స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top