
చదివిన కాలేజీకి అండగా నిలిచేందుకు ఓ వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. కాలేజీలో కొత్త కోర్సు ప్రారంభించేందుకు భారీ విరాళం ఇచ్చారు. ఏకంగా వంద కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకు వచ్చారు.
ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ తోటి వ్యాపారవేత్తలకు ఆదర్శనంగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. తాను చదివిన ఐఐటీ కాన్పూరు కాలేజీకి రూ. 100 కోట్ల భూరి విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో ఐఐటీ కాన్పూరులో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు.
ఐఐటీ కాన్పూరుకి ఆ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు ఎప్పుడూ అండగా ఉంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వసతులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల రీత్యా మెడికల్ ఇంజనీరింగ్‌పై ఈ కాలేజీ దృష్టి సారించింది. అయితే ప్రభుత్వం నుంచి నిధులు అందడానికంటే ముందే ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వీరిలో రికార్డు స్థాయిలో రాకేశ్ గంగ్వాల్ ఏకంగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాకేశ్ గంగ్వాల్ అందించిన నిధులతో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీగా పేరు పెట్టనున్నారు. మూడేళ్లలో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా
We are grateful to Mr Rakesh Gangwal, Mrs Shobha Gangwal and his daughter Ms Parul Gangwal who could take time and be present in person for the agreement signing in Mumbai today. @DoRA_IITK @IITKanpur @paniitindia pic.twitter.com/b0Umzdvv7E
— Abhay Karandikar (@karandi65) April 4, 2022