
బెంగళూరు భారతదేశంలోని టెక్ రాజధానిగా ప్రసిద్ధి చెందినప్పటికీ కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరు కొత్త టెక్, స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు దీన్ని భవిష్యత్ ఆవిష్కరణల కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బెంగళూరు వైద్యుడు డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్ వేదికగా వెలసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి.
ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ పోస్ట్ ప్రకారం.. ‘మంగళూరులో ఇప్పటికే 25,000 మంది టెక్ నిపుణులు ఉన్నారు. గొప్ప ప్రతిభ, మెరుగైన జీవన నాణ్యత, సరసమైన గృహాలు, ఉన్నత విద్యా సంస్థలు, అద్భుతమైన బీచ్ ఉంది’ అని తెలిపారు. ఈ పోస్ట్‌కు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మద్దతు తెలియజేస్తూ..‘మంగళూరు కేవలం టెక్ హాట్ స్పాట్ మాత్రమే కాదు. యువ పారిశ్రామికవేత్తలు, సమతుల్య జీవితం కోసం చూసే నిపుణులకు ఆదర్శ గమ్యస్థానం. ఇది ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇది ఆసియాలో ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానంగా మారుతుంది’ అన్నారు.
The first step should be to build a proper International Airport away from the hill on which it is perched currently. https://t.co/VIF0QBWoep
— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 6, 2025
అయితే, బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందిస్తూ..‘మంగళూరు తదుపరి సిలికాన్ కోస్ట్ కావడానికి ముందు చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ప్రమాదకరమైన రన్‌వే కాకుండా మెరుగైన అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం’ అని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొందరు మంగళూరు విమానాశ్రయం ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం మాదిరిగా సౌకర్యవంతంగా, నగరానికి దగ్గరగా ఉందని చెప్పారు. అయితే, టెక్ హబ్‌గా మారిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమా అని డాక్టర్ దీపక్ ప్రశ్నించారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.32 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించించినట్లు నెటిజన్లు తెలిపారు. ఇది మునుపటి రికార్డును మించిపోయిందని, ప్రస్తుతం రన్‌వేను 150 మీటర్లు పొడిగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా