Walt Disney Layoffs 7k Jobs To Be Affected Over The Next Four Days, Details Inside - Sakshi
Sakshi News home page

Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్‌ బాంబు!

Mar 28 2023 11:58 AM | Updated on Mar 28 2023 12:07 PM

Disney layoffs 7k jobs to be affected over the next four days - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, పార్క్స్ విభాగాల ఉ‍ద్యోగులు ప్రభావితం కానున్నారు. 'రాబోయే నాలుగు రోజుల్లో' ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఈ మేరకు డిస్నీసీఈవో బాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు ఇమెయిల్‌లో తెలియజేశారు.

5.5 బిలియన్ డాలర్ల  మేర ఖర్చుల ఆదా, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో బాబ్‌ ఇగర్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలి డిస్నీసబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అటు గత మూడు నెలల్లో డిస్నీ+కు ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో  కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement