గూగుల్‌పే యూజర్లకు సర్‌ప్రైజ్‌..  ఫ్రీగా సిబిల్‌ స్కోర్‌

cibil score free in google pay - Sakshi

యూజర్లకు గూగుల్‌పే (Google pay) సర్‌ప్రైజ్‌ సర్వీస్ అందిస్తోంది. బ్యాంక్‌ లోన్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు కీలకమైన సిబిల్‌ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోరు (CIBIL Score)ను ఉచితంగా ఇస్తోంది.  ఈ సిబిల్‌ స్కోరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ స్కోరు ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అనేక వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్‌ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పడు గూగుల్‌పే కూడా సిబిల్‌ స్కోరును ఉచితంగా ఇస్తోంది.

(కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!)

సిబిల్‌ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ.  బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా సిబిల్ స్కోరును తయారు చేస్తుంది. సిబిల్‌ స్కోర్‌ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్‌ సిబిల్‌ స్కోర్‌’గా, 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు.

(ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ)

గూగుల్‌ పే ద్వారా సిబిల్‌ స్కోర్‌ తెలుసుకోవాలంటే యాప్‌ ఓపెన్‌ చేసి ‘మేనేజ్‌ యువర్‌ మనీ’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘చెక్‌ యువర్‌ సిబిల్‌ స్కోర్‌ ఫర్‌ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.  తర్వాత ‘A good CIBIL score gets you better interest rates on loans. Wonder if you will have a good score?’ అనే ప్రశ్న కనిపిస్తుంది. దాని కింద కనిపించే మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకొని ‘Let’s check’ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత పాన్‌ కార్డ్‌పై ఉన్న విధంగా పేరు నమోదు చేసి కంటిన్యూ ట్యాబ్‌పై క్లిక్‌ చేయగానే మీ సిబిల్‌ స్కోర్‌ కనిపిస్తుంది.

(గూగుల్‌ చీకటి ‘గేమ్‌’! రూ.260 కోట్ల భారీ జరిమానా..)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top