Google Play Store: యాప్స్‌ డేంజర్‌గా మారడానికి రీజన్‌ ఇదే?.. మీ ఫోన్‌లో ఇలా చేస్తే ముప్పు తప్పినట్లే!

Avast Found Thousands Of Malcious Apps In Google Play Store - Sakshi

సురక్షితంకానీ యాప్‌ల జోలికి వెళ్లొద్దని, ఫోన్‌లో గనుక అలాంటివి ఉంటే వాటిని తక్షణమే తొలగించాలని స్టోర్‌లు(గూగుల్‌, యాపిల్‌) ఎప్పటికప్పుడు యూజర్లను హెచ్చరిస్తూనే ఉంటాయి కదా. కానీ, ఈసారి ఆ అలర్ట్‌ భారీ లెవల్‌లోనే రిలీజ్‌ అయ్యింది.  ఒక్క గూగుల్‌ ప్లేస్టోర్‌లోనే 19 వేల అరక్షితమైన యాప్‌లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. 

డిజిటల్‌ సెక్యూరిటీ కంపెనీ ఎవాస్ట్‌..  ఒక్క గూగుల్‌ ప్లేస్టోర్‌లో సేఫ్‌కాని 19,300 యాప్‌ల్ని గుర్తించింది.  డేటాబేస్‌(ఫైర్‌బేస్‌ అంటారు)లో భద్రతలేని ఈ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కడం, తద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఎవాస్ట్‌ హెచ్చరించింది.

యాప్స్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ను సురక్షితమైన సోర్స్‌గా భావిస్తుంటారు. కానీ, ఇందులో ఉన్న యాప్స్‌ కూడా యూజర్‌ డాటాకు ముప్పు తెచ్చేవే అని తర్వాతి కాలంలో వెలుగు చూసింది. ప్రస్తుతం గుర్తించిన యాప్‌ల వివరాల్ని గూగుల్‌కు అందజేశామని, తద్వారా యాప్‌ డెవలపర్స్‌ అప్రమత్తం అవుతారని ఆశిస్తున్నామని ఎవాస్ట్‌ తెలిపింది.

పొరపాటు ఇదే..   
సాధారణంగా ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో  యాప్స్‌(మొబైల్‌-వెబ్‌ యాప్స్‌) డెవలపింగ్‌ కోసం ఫైర్‌బేస్‌ను ఉపయోగిస్తారు డెవలపర్స్‌. ఆ మొత్తాన్ని ఇతర డెవలపర్స్‌కు కనిపించేలా ఉంచుతారు. ఈ క్రమంలో ఈ డేటాబేస్‌ ద్వారా ఆ సమాచారం మొత్తం అందరికీ చేరుతుంది.  వీటిలోని యాప్స్‌ మిస్‌కన్‌ఫిగరేషన్‌ ప్రభావం వల్ల.. లైఫ్‌స్టైల్‌, వర్కవుట్‌, గేమింగ్‌​, మెయిల్స్‌, ఫుడ్‌ డెలివరీ ఇతరత్ర యాప్‌ల నుంచి డేటా లీక్‌ కావొచ్చు. అంటే యూజర్ల పేర్లు, చిరునామా, లొకేషన్‌ డేటా, ఒక్కోసారి పాస్‌వర్డ్‌లు కూడా హ్యాకర్ల చేతికి అందుతాయి.
 

మొత్తంగా లక్షా ఎనభై వేల మూడు వందల యాప్స్‌ను ఎవాస్ట్‌ థ్రెట్‌ ల్యాబ్‌ రీసెర్చర్స్‌ పరిశీలించారు. అందులో 10 శాతం అంటే.. 19,300 యాప్స్‌ ఓపెన్‌గా,  గుర్తింపులేని డెవలపర్స్‌ నుంచి డాటాను లీక్‌ చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. 

జాగ్రత్తలు..  

వెరిఫై మార్క్‌ లేని యాప్స్‌ లేని డౌన్‌లోడ్‌ చేయకపోవడం బెటర్‌. 

యాప్‌ పర్మిషన్‌ విషయంలో అలర్ట్‌గా ఉండాలి. లేకుండే డాటా మొత్తం లీక్‌ అవుతుంది

ప్లేస్టోర్‌లలో కింద రివ్యూలు, సమాచారం పూర్తిగా చదవాలి. ఒక్కోసారి ఫేక్‌ రివ్యూలు బోల్తా కొట్టిస్తుంటాయి. కాబట్టి, జెన్యూన్‌ రీజన్‌ ఉంటేనే డౌన్‌లోడ్‌ చేయాలి. 

రివార్డులు ఆఫర్‌ చేసే యాప్స్‌ విషయంలో మరింతజాగ్రత్త అవసరం.

యాంటీ వైరస్‌ ఎంపికలోనూ ఆచీతూచీ వ్యవహరించాలి.
 

ఒక్కోసారి ‘మొబైల్స్‌’కు హాని చేస్తాయనే సందేశాన్ని పట్టించుకోకుండా ‘టెంప్టింగ్‌’ యాప్స్‌ను డౌన్‌ లోడ్‌ చేస్తుంటారు. ఈ చర్య తెలిసిమరీ గోతి తవ్వుకున్నట్లే.. 

గేమ్స్‌ ఆడేటప్పుడు లేదంటే అశ్లీల వీడియోలు చూసేటప్పుడు వచ్చే యాప్స్‌ నోటిఫికేషన్‌ సురక్షితమైనది ఎంతమాత్రం కాదు

అవతలివాళ్ల సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను అన్‌లాక్‌ చేసి చూడాలనే ఉత్సుహకతతో ఇలాంటి అరక్షితమైన యాప్స్‌ను ప్రొత్సహిస్తుంటారు కొంతమంది. కానీ, మిగతా యాప్స్‌ కన్నా ఇలా డౌన్‌ లోడ్‌ చేసే యాప్స్‌ ఎక్కువగా డ్యామేజ్‌ చేస్తుంటాయి. 

చదవండి: యాప్‌ మార్కెట్‌.. గూగుల్‌, యాపిల్‌కు భారీ షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top