
సాక్షి, ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక సంతోషకరమైన వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల మహీంద్రా లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ తన చేతికి వచ్చిన ముచ్చటను ట్విటర్‌లో షేర్ చేశారు. నిజంగా ఇది నాకు బిగ్ డే.. స్కార్పియో ఎన్ ను రిసీవ్ చేసుకున్నా. అయితే దీనికి ఒక మంచి పేరు కావాలి. ఎవరైనా పేరు సూచించే వారికి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.
స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని భారత మార్కెట్‌లో మహీంద్రా ఇటీవల లాంచ్ చేసింది. ఈ పండుగ సీజన్‌లో స్కార్పియో-ఎన్ డెలివరీలను ప్రారంభించింది. ఈ క్రమంలో మహీంద్ర ప్రతినిధి ఆనంద్ మహీంద్రకు స్కార్పియో-ఎన్ తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర, తన స్కార్పియోకు పేరు సూచించమని అభిమానులను అడగడం విశేషంగా నిలిచింది.
స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ క్యాబిన్ ప్రీమియం లుక్‌తో, 3D సరౌండ్ 12-స్పీకర్ సోనీ సిస్టమ్, విశాలమైన సన్‌రూఫ్, రిచ్ కాఫీ బ్లాక్ లెథెరెట్ సీట్లు, సిక్స్-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో లాంచ్ చేసింది. స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీ ధర Z2 పెట్రోల్ MT వేరియంట్ రూ. 11.99 లక్షల నుండి ప్రారంభం. అలాగే Z8 L డీజిల్ MT వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. 5 వేరియంట్‌లు, ఏడు రంగుల్లో లభ్యం. ఈ ఏడాది జూలై 31న బుకింగ్‌లు ప్రారంభమైన తొలి నిమిషంలోనే 25 వేలకు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. అంతేకాదు ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా లక్ష బుకింగ్స్ నమోదు చేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Big day for me; received my ScorpioN…. Need a good name for it…Recommendations welcome! pic.twitter.com/YI730Eo9uh
— anand mahindra (@anandmahindra) October 7, 2022