వీఆర్వో అనుమానాస్పద మృతి
మార్టూరు: మండలంలోని చిమ్మిరిబండ గ్రామ వీఆర్వో పి.శామ్యూల్ (60) శనివారం ఉదయం మార్టూరులో మృతి చెందారు. బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన శామ్యూల్ కొంతకాలంగా మండలంలోని చిమ్మిరిబండ గ్రామ వీఆర్‌ఓగా డిప్యూటేషన్‌పై వచ్చారు. మార్టూరులోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన నివాసంలో పడిపోయి ఉన్న ఆయన్ను గమనించిన స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


